![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్- 1090 లో.. వసుధార నుదుటిన కుంకుమ దిద్ది.. ఇంట్లో జరిగే వ్రతానికి ఆహ్వానిస్తుంది ధరణి. తప్పుకుండా వస్తానని మాట ఇస్తుంది వసుధార. 'నీకోసం ఎక్కడికైనా వస్తుంది.. నాకు తెలుసు.. అంతేకదా వసుధార" అని వెటకారంగా అంటుంది దేవయాని. ఇక ధరణిని తీసుకుని దేవయాని వెళ్లిపోగా.. మహేంద్రకి అనుమానం వస్తుంది. ఇంత సడెన్‌గా వదినగారు.. ధరణి గురించి ఆలోచిస్తున్నారంటే.. నాకేదో అనుమానంగా ఉందని సందేహిస్తాడు. వ్రతం కదా అలా చేయదులే అని వసుధార అంటే.. పాపాత్ములు ఎంతకైనా తెగిస్తారు.. నువ్వు నమ్మొద్దని అంటాడు మహేంద్ర. నేను నమ్మేది ధరణి మేడమ్‌ని మామయ్యా.. ఆమె ఇంతకు ముందులా లేరు.. శైలేంద్ర విషయంలో ప్రతి విషయాన్ని మనకి చెప్తూనే ఉంది. తన వల్లే కదా.. శైలేంద్రని ట్రాప్ చేశానని అంటుంది వసుధార. ‘అవునులే కానీ.. ఇన్నిరోజులూ లేనిది వదినగారు ధరణి సంతానం గురించి ఆలోచించడం ఏంటి? అని అంటాడు. అదేం లేదు మామయ్యా.. మర్మం ఏం ఉండకపోవచ్చని అంటుంది వసుధార. సరే.. నేనైతే రాను.. నువ్వు వెళ్తావా అనుపమా అని అడుగగా.. నేను వెళ్లనని అనుపమ అంటుంది. వెరీ గుడ్ మంచి నిర్ణయం తీసుకున్నావని మహేంద్ర అంటాడు.
ఆ తర్వాత వసుధార పూజకి వెళ్తుంది. ధరణి, శైలేంద్ర కలిసి పూజ చేస్తారు. ఆ తర్వాత అందరికి తాంబూలం ఇస్తుంది ధరణి. ఇక వసుధారకి ఇస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు వద్దని, రిషి చనిపోయాడు కదా.. తనకెలా ఇస్తారంటూ గొడవకి దిగగా.. ఒక్కొక్కరికి వసుధార ఇచ్చిపడేస్తుంది. నువ్వు భర్త చచ్చిన దానికి తాంబూలం ఇస్తే.. వ్రతం చేసి ఉపయోగం లేదు.. ఈ ఇంటికి అరిష్టం జరుగుతుంది అని అంటారు అమ్మలక్కలు. ఏం జరిగినా సరే.. తనకి తాంబూలం ఇచ్చేతీరతాను.. పూజ ఫలించకపోయినా పర్లేదు.. వ్రతం చెడిపోయినా పర్లేదు.. నాకు పిల్లలు పుట్టకపోయినా పర్లేదు.. వసుధారకి తాంబూలం ఇచ్చే తీరతాను.. నా మంచి కోరి వచ్చిన వాళ్లు అవమానంతో తిరిగి వెళ్లడం నాకు ఇష్టం లేదు.. మీరంతా తన భర్త చనిపోయాడని అంటున్నారు. కానీ తన భర్త బతికే ఉన్నారని తను బలంగా చెప్తుంది. చనిపోయాడని చెప్పడానికి ఆధారం లేదు.. బతికి ఉన్నాడని చెప్పడానికి తనే సాక్ష్యం.. తనే కాదు.. నేనూ చెప్తున్నానని ధరణి అంటుంది.
రిషి బతికే ఉన్నాడు.. మా రిషి ఖచ్చితంగా తిరిగి వస్తాడు.. వసుధార ధీర్ఘసుమంగళిగా ఉంటుంది. తనకి తాంబూలం ఇవ్వడంలో నాకు ఎలాంటి అభ్యతరం లేదని ధరణి అంటుంది. కాసేపటికి వసుధారకి తాంబూలం అందిస్తుంది ధరణి. వసుధార మొహమాటపడటంతో.. నాకు పిల్లలు పుట్టకపోయిన పర్లేదు. ఆ దేవుడు మంచి వాళ్లకి ఎప్పుడు చెడు చేయడు.. తాంబూలం తీసుకోమని వసుధారకి ధరణి తాంబూలం ఇస్తుంది. వాటిని తీసుకుని ఏడుస్తూ వెళ్లిపోతుంటుంది వసుధార. తను తాంబూలం ఇచ్చింది సరే.. తీసుకోవడానికి ఈమెకి బుద్ది ఉండొద్దని అమ్మలక్కలు అనడంతో.. వసుధార ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |